Fri Dec 05 2025 17:50:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేనలో చేరనున్న మండలి?
టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన లో చేరనున్నారు

టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన లో చేరనున్నారు. అవనిగడ్డ నుంచి 2009, 2014 లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈరోజు హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ సమక్షంలో మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలో చేరనున్నారని తెలిసింది. ఆయనకు అవనిగడ్డ సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదరడంతో జనసేనలో చేరుతున్నారని చెబుతున్నారు.
అవనిగడ్డ అభ్యర్థిని...
ఇప్పటి వరకూ అవనిగడ్డ అభ్యర్థిని జనసేన ప్రకటించలేదు. అక్కడ అనేక మంది పోటీ పడుతున్నా ఇంకా పెండింగ్ లోనే ఉంచింది. అవనిగడ్డలో అనేక మంది పోటీ పడుతుండటంతో దీనిని పెండింగ్ లో పెట్టారని అనుకున్నారు. కానీ నేడు మండలి బుద్దప్రసాద్ చేరితే అవనిగడ్డ టిక్కెట్ ను మండలి బుద్ధప్రసాద్ కు ఇస్తారని తెలిసింది.
Next Story

