Thu Mar 19 2026 13:09:07 GMT+0530 (India Standard Time)
ఆ కేసులో జగనే దోషి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వివేకా హత్య కేసును పక్కదోవ పట్టించేందుకే భీమ్లా నాయక్ సినిమాపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. వివేకా హత్య కేసులో ఉన్న దోషులను తప్పించేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. తన పేరు ఈ కేసులో ఎక్కడ బయటపడుతుందోనని జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు. హత్యను ప్రోత్సహించిన వారు కూడా నిందితులేనని వెంకన్న అన్నారు.
సీఎం పదవికి....
సీబీఐ జరిపిన విచారణలో అవినాష్ రెడ్డి, అతని తండ్రి ప్రమేయం ఉందని తేలిందన్నారు. అయినా అవినాష్ రెడ్డిని ఇంతవరకూ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్పారు. ఈ కేసులో నిందితుడు జగన్ అని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీబీఐ ముందు హాజరు కావాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించడానికే భీమ్లా నాయక్ సినిమాపై వివాదాన్ని సృష్టించారన్నారు.
Next Story

