Sun Mar 15 2026 06:13:58 GMT+0530 (India Standard Time)
నా పింఛన్ లో 1500 కోత పడింది
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలపై టీడీపీ నేత, మాజీ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు ఫైర్ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలపై టీడీపీ నేత, మాజీ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు ఫైర్ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతల నిర్వాకం కారణంగానే ఈరోజు ఉద్యోగులు అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చిందని అన్నారు. తనకు నెలకు 1500 రూపాయల పింఛన్ తగ్గిందని అశోక్ బాబు తెలిపారు.
ఉద్యోగ సంఘాల నేతలదే బాధ్యత....
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు ఒప్పుకున్నారని అశోక్ బాబు ప్రశ్నించారు. ప్రభుత్వం దుర్మార్గమైన పీఆర్సీని ప్రకటించిందన్నారు. ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసే ఈ పీఆర్సీని వ్యతిరేకించాలని అశోక్ బాబు పిలుపు నిచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఉద్యోగులకు, పింఛనుదారులకు అండగా నిలవాలని కోరారు.
- Tags
- ashok babu
- prc
Next Story

