Mon Mar 23 2026 12:55:50 GMT+0530 (India Standard Time)
నేడు రెండోరోజు కుప్పంలో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో చంద్రబాబు బస చేశారు. అక్కడ ఈరోజు ఉదయం ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అక్కడే అధికారులు ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల నుంచి...
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. మరికొన్ని హామీలు చంద్రబాబు ఇవ్వనున్నారు. ఈరోజు కూడా రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొంటారు. కుప్పం ముఖ్య నేతలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.
Next Story

