Sun Mar 15 2026 13:26:02 GMT+0530 (India Standard Time)
తిరుపతికి చంద్రబాబు... పది గంటల నుంచి?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతికి రానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతికి రానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఆయన పర్యటనకు ఏర్పాట్లు పార్టీ నేతలు పూర్తి చేస్తారు. ఉదయం పది గంటలకు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. నిన్న కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు.
ఇక్కడి నుంచి....
చిత్తూరు జిల్లలోని ఏర్పేడు, తిరుపతి రూరల్, తిరుపతి, అర్బన్, చంద్రగిరి ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. రాయల చెరువు పరిస్థితిపై కూడా ఆయన అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం నెల్లూరు జిల్లాలోపర్యటించే అవకాశముంది. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

