Wed Feb 08 2023 07:42:33 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ తెలియదు
జగన్ కు డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

జగన్ కు డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజా వేదిక కూల్చి నేటికి మూడేళ్లు అయిందని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రజావేదికను కూల్చి వేశారన్నారు. మూడేళ్ల పాలన ఎలా ఉంటుందో ముందే తాను చేసి చూపించారని చంద్రబాబు అన్నారు. జగన్ అన్ని వ్యవస్థలను కూల్చి వేశారన్నారు. ఏ వర్గమూ జగన్ పాలనలో సంతోషంగా లేదన్నారు చంద్రబాబు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను కలను కూడా జగన్ కూల్చివేశారన్నారు.
డీజీపీకి లేఖ....
మరోవైపు చిత్తూరు జిల్లాలో కటారి అనూరాధ దంపతుల హత్య కేసులో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు. నిందితులను శిక్షించకుండా సాక్షులను పోలీసులే బెదిరిస్తున్నారని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ మేయర్ ఇంటిపై దాడి ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.
Next Story