Tue Dec 30 2025 20:34:52 GMT+0000 (Coordinated Universal Time)
వాసన పసిగట్టి వచ్చే వారికి నో ఛాన్స్.. బాబు సెన్సేషనల్ కామెంట్స్
ప్రతి ఒక్కరి లెక్కలు తాను రికార్డు చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు

ప్రతి ఒక్కరి లెక్కలు తాను రికార్డు చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇకపై వలస పక్షలకు అవకాశముండదని తెలిపారు. ఎన్నికలకు ముందు గెలుపు వాసన పసిగట్టి వచ్చే వారికి నో ఛాన్స్ అని చంద్రబాబు చెప్పారు. గతంతో ఈ సిద్ధాంతం అమలు చేయలేకపోవడం వల్లనే ఇబ్బంది పడుతున్నామని చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే గుర్తింపు ఉంటుందని చంద్రబాబు అన్నారు.
అన్నీ రికార్డు చేస్తున్నా....
చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడారు. మొత్తం 15 అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు వైసీపీ తొత్తులుగా మారిపోయారన్నారు. తాను అన్నింటిని రికార్డు చేసి పెడుతున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి విషయం చూసుకుంటానని చంద్రబాబు అన్నారు.
Next Story

