Tue Dec 30 2025 13:59:16 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి నేనే సీఎం... వాళ్లను వదలిపెట్టను
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ముఖ్యమంత్రిని తానేనని చంద్రబాబు అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ముఖ్యమంత్రిని తానేనని చంద్రబాబు అన్నారు. అతిగా ప్రవర్తించే వారందినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన వారికి శిక్షలు పడేలా తాను చూస్తానని అన్నారు. కుప్పంలో రెండోరోజు పర్యటనలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇబ్బంది పెట్టిన వాళ్లను....
టీడీపీ నేతలను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదని చంద్రబాబు చెప్పారు. టీడీపీకి కూడా మంచి రోజులొస్తాయని అన్నారు. తాను మళ్లీ సీఎంను అవుతానని, అప్పడు వారి సంగతి తేలుస్తానని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలు ఎవరూ భయపడవద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Next Story

