Sat Dec 27 2025 00:23:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గన్నవరానికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు గన్నవరం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు గన్నవరం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించనున్నారు. గన్నవరంలో ఘర్షణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గన్నవరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పరామర్శకు...
గన్నవరం పర్యటనలో ప్రసాదంపాడులోని రామినేని రమేష్ నివాసానికి తొలుత వెళ్లనున్న చంద్రబాబు అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ లోని దొంతు చిన్నా నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గన్నవరం ఘర్షణల నేపథ్యంలో పట్టాభితో పాటు పదకొండు మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ గన్నవరంలో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

