Thu Jan 29 2026 09:09:55 GMT+0000 (Coordinated Universal Time)
సభలో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు
చంద్రబాబు హుటాహుటిన టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు

ఏడుసార్లు ఎన్నికయ్యాను. మహా మహా నాయకులతో పనిచేశా. జాతీయ స్థాయి నేతలతో కలసి పనిచేశాం. గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఎదురవుతున్న అనుభవాలు నేను ఎప్పుడూ చూడలేను. ఎన్నో అవమానాలను భరించాను. అనరాని మాటలు అంటున్నారు. నా కుటుంబాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఏ పరువు కోసమే అయితే తాను బతుకుతున్నానో దానిన తీసేస్తున్నారన్నారు. నా భార్య ప్రస్తావన కూడా తీసుకు వస్తున్నారని చంద్రబాబు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కొడాలి నాని చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో చంద్రబాబు రియక్ట్ అయ్యారు.
హడావిడిగా సమావేశం....
దీంతో చంద్రబాబు హుటాహుటిన టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. వైసీపీ సభ్యులు శృతిమించేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు సమావేశంలో అభిప్రాయపడ్డారు. శాసనమండలి నుంచి లోకేష్ ను, యనమల రామకృష్ణుడిని అర్జంటుగా పిలిపించి చర్చిస్తున్నారు.
Next Story

