Mon Mar 23 2026 16:23:17 GMT+0530 (India Standard Time)
నేడు ఆ ఇన్ ఛార్జి పదవి ఎంపిక కోసం చంద్రబాబు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ముఖ్యంగా తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడాన్ని గుర్తించిన చంద్రబాబు అక్కడ బలమైన నేతను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.
బలమైన లీడర్ కోసం....
తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి ఉన్నారు. ఆయనను ఎదుర్కొనేందుకు ధీటైన నాయకత్వం ఎంపిక కోసం నేడు చంద్రబాబు తంబళ్లపల్లె నేతలతోసమావేశం కానున్నారు. పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకుని తంబళ్లపల్లె ఇన్ ఛార్జి నియామకాన్ని చంద్రబాబు చేపడతారు. లక్ష్మీదేవమ్మ కుటుంబం నుంచే ఇన్ ఛార్జి ఎంపిక జరుగుతుందని భావిస్తున్నారు.
Next Story

