Sat Dec 13 2025 22:25:49 GMT+0000 (Coordinated Universal Time)
జనం ఎమ్మెల్యేల కాలర్ పట్టుకుంటున్నారు
ప్రశ్నించిన వారందరిపై కేసులు పెట్టడం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు

ప్రశ్నించిన వారందరిపై కేసులు పెట్టడం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అలా అయితే ఏపీలోని ఐదుకోట్ల మంది ప్రజలపై కేసులు పెట్టాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యాదీవెన పై ప్రశ్నించిన విద్యార్థి జస్వంత్ పై కేసు ఎందుకు పెట్టారన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వ అసహనానికి ఇది ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు.
అక్రమ కేసులతో...
విద్యార్థులపై కేసుల పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయన్నారు. వాటిని తట్టుకోలేని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్యేల జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారన్నారు. వెంటనే పూతలపట్టులో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story

