Tue Dec 30 2025 15:30:06 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై భ్రమలు తొలుగుతున్నాయ్
ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఏదో చేస్తారని ప్రజలు జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. అయితే వారు ఊహించిందేమీ జరగకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి జగన్ పట్ల పెరిగిందన్నారు.
వ్యవసాయ రంగం....
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పంటల పర్యవేక్షణ కొరవడిందని, ఫలితంగా వ్యవసాయరంగం పూర్తిగా కుంటుపడిందన్నారు. వ్యవసాయ రంగానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యమని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రజాసమస్యలపై విస్తృతంగా పోరాటాలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
Next Story

