Mon Mar 23 2026 12:58:06 GMT+0530 (India Standard Time)
పొత్తులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పొత్తులు అవసరమన్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పొత్తులు అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పొత్తులతో గెలిచామని, పొత్తులు పెట్టుకుని ఓడిపోయామని ఆయన గుర్తు చేశారు. పుంగనూరులో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి ఎలా గెలుస్తాడో చూస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
కుప్పం అంటే....
పొత్తులపై నిర్ణయం ఇప్పుడే ఉండబోదని చంద్రబాబు చెప్పారు. కుప్పం నియోజకవర్గంతో తనకు ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉందని చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.
Next Story

