Fri Dec 05 2025 12:41:47 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలు కాలకేయులుగా మారారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. వైసీీపీ నేతలు మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వైసీపీ నేతలు కాలకేయులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని అనిత ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా....
వైసీపీ నేత గరికపాటి నరసింహారావు తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వంగలపూడి అనిత చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 1500 కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని అనిత ఆరోపించారు. దిశ కింద ఎవరికీ ఇప్పటి వరకూ శిక్ష విధించలేదన్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే మహిళలపై అఘాయిత్యాలకు కారణమని అనిత అభిప్రాయపడ్డారు.
Next Story

