Thu Dec 18 2025 18:06:26 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి అయ్యన్న ఫైర్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తిరుమలను దర్శంచుకున్నారు. ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తిరుమలను దర్శంచుకున్నారు. ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని స్వామి వారిని వేడుకున్నట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు. గత మూడేళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయి, అన్ని రకాలుగా బాధలు పడుతున్నారని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఏ వర్గమూ ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేదని ఆయన అన్నారు.
నిలువు దోపిడీ.....
తిరుమలలో లేని పోని ఆంక్షలను పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుల నుంచి టీటీడీ దోపిడీ చేస్తుందని చెప్పారు. అరాచక పాలనను అంతమొందించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, మహానాడుకు వచ్చిన జనసందోహాన్ని చూస్తేనే అర్ధమవుతుందని ఆయన తెలిపారు.
Next Story

