Mon Dec 15 2025 20:19:00 GMT+0000 (Coordinated Universal Time)
సభకు వెళతాం : టీడీఎల్పీ
తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. తొలిసారి చంద్రబాబు గైర్హాజరీలో టీడీఎల్పీ సమావేశం జరిగింది.

తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. తొలిసారి చంద్రబాబు గైర్హాజరీలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. అచ్చెన్నాయుడు అధ్యక్షతన శాసనసభపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది.
సభలోనే నిలదీస్తాం...
శాసనసభకు వెళ్లి చంద్రబాబు అరెస్ట్ అక్రమమని తమ గళం విప్పాలని పార్టీ నేతలు నిర్ణయించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలిపటానికి కూడా వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి చర్చకు పట్టు పట్టాలని కూడా సమావేశంలో నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సభకు వెళ్లి అక్కడే ప్రభుత్వాన్ని నిలదీయడం సరైన ఆలోచన అని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Next Story

