Sat Dec 06 2025 03:34:07 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగనుంది. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలను తెలియజేయనుంది.

తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగనుంది. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలను తెలియజేయనుంది. ప్రధానంగా కల్తీసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలను నిరసిస్తూ ఆందోళనలకు దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
కల్తీ సారా తాగి....
పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా తాగి 25 మంది మరణించినా వాటిని సహజమరణాలుగా ప్రభుత్వం చిత్రీకరిస్తుందని తెలిపారు. అక్కడ మృతుల కుటుంబాలను కూడా కలుపుకుని ఆందోళన చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. టీడీపీ ఆందోళనకు పిలుపు నివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.
- Tags
- protest
Next Story

