Thu Dec 18 2025 10:09:15 GMT+0000 (Coordinated Universal Time)
రైతుల కోసం... నేడు తెలుగుదేశం
ఏపీ లో తెలుగుదేశం పార్టీ నేడు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనుంది. రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనుంది

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేడు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనుంది. రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనుంది. విత్తనం నుంచి విక్రయం వరకూ దగాపడ్డ రైతన్న పేరుతో ఈ నిరసనలు చేపట్టాలని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దగాపడిన....
ఏపీలో రైతులకు జగన్ ప్రభుత్వం మోసం చేస్తుందని, విత్తనాల సరఫరా, కనీస మద్దతు ధర వరకూ రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిపై నేడు నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసనలు తెలియజేయాలని పోలీసులు చెబుతున్నారు.
Next Story

