Tue Mar 10 2026 06:44:59 GMT+0530 (India Standard Time)
నేడు కూడా టీడీపీ నిరసన
నాటుసారా మరణాలపై తెలుగుదేశం పార్టీ తన నిరసనలను కొనసాగిస్తుంది. ఈరోజు కూడా నారా లోకేష్ నేతృత్వంలో నిరసన తెలిపారు.

నాటుసారా మరణాలపై తెలుగుదేశం పార్టీ తన నిరసనలను కొనసాగిస్తుంది. ఈరోజు కూడా నారా లోకేష్ నేతృత్వంలో నిరసన తెలిపారు. నాటుసారా, జే బ్రాండ్ మద్యం కారణంగా అనేక మంది మరణిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు నిరసన తెలుపుతూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ప్రాంగణానికి వచ్చారు.
నాటుసారా....
ముఖ్యమంత్రి జగన్ ఫొటోపై మద్యాన్ని పోసి తమ నిరసనను తెలియజేశారు. మద్యనిషేధం హామీ ఏమైందంటూ టీడీపీ శాసనసభ్యులు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను మత్తులో ఈ ప్రభుత్వం ముంచెత్తుతుందని ఆరోపించారు. డ్రగ్స్ నుంచి నాటు సారా వరకూ వైసీపీ నేతలు కనుసన్నల్లోనే జరుగుతుందని వారు ఆరోపించారు.
Next Story

