Fri Dec 05 2025 13:22:00 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఆరుగురు సీనియర్ టీడీపీ లీడర్లపై సస్పెన్షన్ వేటు
తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరుగురు నేతలను సస్పెండ్ చేసింది

తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరానికి చెందిన మీసాల గీత, అమలాపురానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావులపై సస్పెన్షన్ వేటు వేశారు.
నిబంధనలను అతిక్రమించిన...
ఉండి నియోజకవర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వీరు తెలుగుదేశం పార్టీ నిబంధనలను అతిక్రమించారని ఆయన తెలిపారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Next Story

