Fri Sep 13 2024 01:35:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకుంది. కోనేటి ఆదిమూలం పై లైంగిక వేధింపులపై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనపై మూడు సార్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై తన ఫోన్ నెంబరు తీసుకున్నాడని, అప్పటి నుంచి తనకు ఫోన్ చేసి రూమ్ కు రమ్మని పిలిచేవాడని తెలిపారు.
చంద్రబాబును కు...
మహిళ ఆధారాలు...
అయితే మహిళ తనకు కోనేటి ఆదిమూలం చేసిన అన్యాయాన్ని చంద్రబాబుకు లేఖరూపంలో మహిళ అందించింది. ఆధారాలతో సహా పంపింది. దీంతో టీడీపీ విచారణ చేపట్టి నిజమని తేలడంతో కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. మహిళ కొన్ని వీడియోలను కూడా విడుదల చేసింది. బాధితురాలిని తిరుపతిలోని భీమాస్ హోటల్ కు పిలిపించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళ ఆరోపించారు. ఆదిమూలం గురించి అందరికీ తెలయాలనే తాను పెన్ కెమెరాను పెట్టుకున్నానని తెలిపారు. దీంతో టీడీపీ చర్యలు తీసుకుంది.
Next Story