Sun Mar 08 2026 04:09:38 GMT+0530 (India Standard Time)
నేడు సీఐడీ ఎదుటకు చింతకాయల విజయ్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ నేడు మరోసారి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ నేడు మరోసారి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. భారత్ పే అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ చింతకాయల విజయ్ కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన ఒకసారి చింతకాయల విజయ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
మరోసారి విచారణ...
గత నెల 30న సీఐడీ అధికారులు చింతకాయల విజయ్ ను ఎనిమిది గంటల పాటు విచారిస్తున్నారు. రెండోరోజు విచారణ జరుపుతుండటంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు చింతకాయల విజయ్ సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. తాను సీఐడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చింతకాయల విజయ్ మీడియాకు తెలిపారు.
Next Story

