Fri Dec 05 2025 19:56:05 GMT+0000 (Coordinated Universal Time)
28న బెజవాడకు రజనీకాంత్
ఈ నెల 28న బెజవాడకు రజనీకాంత్ రానున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి

ఈ నెల 28న బెజవాడకు రజనీకాంత్ రానున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ కు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. శత జయంతి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకం తీసుకున్న టీడీపీ రజనీకాంత్ తో పాటు మరికొందరు సినిమా స్టార్లను ఆహ్వానించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తుంది.
పోరంకిలో జరిగే...
ఈ నెల 28వ తేదీన పొరంకిలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న రజనీ కాంత్, బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు. ఈ ఏడాది అంతా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన టీడీపీ అనేక సమావేశాలను ఏర్పాటు చేసింది. పార్టీ శ్రేణులను చైతన్యం చేసేందుకు కూడా ఈకార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Next Story

