Mon Mar 16 2026 13:33:55 GMT+0530 (India Standard Time)
అయ్యన్నకు ఊరట
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరయింది

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరయింది. రిమాండ్ ను కోర్టు తిరస్కరించింది. అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్ కు కూడా బెయిల్ లభించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను అరెస్ట్ చేశారని అయ్యన్నపాత్రుడి తరుపున న్యాయవాదులు వాదించారు.
ఆ సెక్షన్ వర్తించదు...
ఈ కేసులో 467 సెక్షన్ వర్తించదని న్యాయస్థానం అభిప్రాయపడింది. 41ఎ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. దీంతో అయ్యన్న పాత్రుడికి బెయిల్ లభించినట్లయింది.
Next Story

