Sun Apr 27 2025 23:19:30 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ హేట్స్ జగన్... పుస్తకం విడుదల
తెలుగుదేశం పార్టీ ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని విడుదల చేసింది.

తెలుగుదేశం పార్టీ ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని విడుదల చేసింది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్కక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. 52 నెలల పాలనలో అంతా అప్పులేనని, ఒక్కో కుటుంబంపై లక్షల రూపాయల రుణభారాన్ని మోపారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. విద్యుత్తు ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచారని, నాసిరకం మద్యంతో లక్షలాది మంది రోగాల బారిన పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో ముప్పయి వేల మంది మరణించారని కూడా అచ్చెన్నాయుడు అన్నారు.
అబద్ధాలు చెబుతూ...
చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పి ప్రజలను నమ్మించాలని జగన్ చూస్తున్నాడన్నారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్ చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ను గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇంకా ఏడు నెలలు మాత్రమే జగన్ కు సమయం ఉందని అన్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Next Story