Thu Mar 19 2026 04:28:51 GMT+0530 (India Standard Time)
మాయమాటలు కట్టిపెట్టి పని మొదలుపెట్టు
రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం స్వాగతించింది.

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం స్వాగతించింది. ఇకనైనా ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అని ప్రకటించి అమరావతిని అభివృద్థి చేయాలని చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. మూడు రాజధానులు అనేది పచ్చి మోసమని పేర్కొంది. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించడానికే మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారని సమావేశం అభిప్రాయపడింది.
వెంటనే నిర్మాణ పనులను...
రాజధాని నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానం చేసింది. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించుకోవాలని సమావేశం జగన్ కు సూచించింది. ఉచితంగా వేలాది ఎకరాలకు భూములిచ్చిన రైతులకు ఇప్పటికైనా న్యాయం జరిగేలా చూడాలని సమావేశం అభిప్రాయపడింది.
Next Story

