Sun May 05 2024 12:10:43 GMT+0000 (Coordinated Universal Time)
రేపు హైదరాబాద్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
రేపు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మేలో జరగనుంది.
రేపు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మేలో జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని...
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకానున్నారు.
Next Story