Thu Mar 19 2026 17:51:36 GMT+0530 (India Standard Time)
కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనుంది.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు పార్టీ ఎంపీలతో ఆయన అక్కడే సమావేశం కానున్నారు. జీ 20 సన్నాహక సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు.
సమావేశాల్లో....
ఆయన మధ్యాహ్నం పార్లమెంటు సభ్యులతో సమావేశమై రానున్న సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నారు. ఏ ఏ అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలోనే పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Next Story

