Thu Mar 23 2023 12:14:52 GMT+0000 (Coordinated Universal Time)
46వ రోజుకు లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువశక్తి మహాపాదయాత్ర యువగళం 46 వ రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువశక్తి మహాపాదయాత్ర యువగళం 46 వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర 46వ రోజు కదిరి నియోజకవర్గంలో జరగనుంది.ఉదయం 8గంటలకు చీకటిమానుపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. 08.45 – గంగసానివారిపల్లిలో టమోటా తులతో లోకేష్ భేటీ అయ్యారు
కదిరి నియోజకవర్గంలో....
9.30 గంటలకు భీసేనివారిపల్లిలో బలిజ సామాజికవర్గీయులతో సమావేశం నిర్వహిస్తారు. 10.25 గంటలకు కొక్కంటి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ జరుపుతారు. 11.15 గంటలకు కొక్కంటి క్రాస్ వద్ద భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామ స్థలంలో ఎస్టీ సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మందిపల్లిలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 4.30 గంటలకు తనకల్లులో ఎస్సీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ అవుతారు. రాత్రికి చినపిల్లోలపల్లి విడిది కేంద్రంలో బస చేస్తారు.
Next Story