Sun Feb 01 2026 06:52:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుపతి జిల్లాకు లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు తిరుపతి జిల్లాలోకి ప్వరేశించనుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు తిరుపతి జిల్లాలోకి ప్వరేశించనుంది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించి నేటికి 18వ రోజు. ఇప్పటి వరకూ లోకేష్ 219 కిలోమీటర్ల మేర నడిచారు. రోజుకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు రాత్రి బస చేసిన వెంకటేశ్వర పెరుమాళ్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో...
అనంతరం చినరాజకుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతూ పాదయాత్ర చేయనున్నారు. రాత్రికి నారాయణవరం సిద్ధార్థ ఇంజినీరిం్ కశాల వద్దకు చేరకుంటారు. ఈరోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి విత్తలతడుకు వద్ద రాత్రి బస చేస్తారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

