Mon Mar 16 2026 01:27:44 GMT+0530 (India Standard Time)
నేడు ఆదోనిలో నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ఆదోని నియోజకవర్గంలో ప్రవేశించనుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ఆదోని నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఉదయం ఏడు గంటలకు ములిగుండం బస నుంచి బయలుదేరిన యాత్ర 8.30 గంటలకు ఆదోని నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 976 కిలో మీటర్ల మేర నడిచారు. 76వ రోజు పాదయాత్ర ఆదోనిలో జరగనుంది. ఉదయం 9 గంటలకు పెదపెండేకల్ లో స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం 11.05 గంటలకు ఆరేకల్లో వాల్మీకులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు.
సామాజిక వర్గాలతో...
మధ్యాహ్నం 12గంటలకు నాగలాపురంలో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఒంటిగంటకు నాగలాపురంలో భోజన విరామానికి ఆగుతారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. నాగలాపురం నుంచి పాదయాత్ర ప్రారంభమై 4.15 గంటలకు నాగలాపురం క్రాస్ వద్ద కోలనాట సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 5.25 గంటలకు కాపటి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి ఆదోనిలో బస చేయనున్నారు.
Next Story

