Sun Feb 01 2026 06:52:53 GMT+0000 (Coordinated Universal Time)
నడుస్తూనే... కలుస్తూనే.. వింటూనే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 261 కిలోమీటర్ల మేర నడిచారు. నేడు పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ఉదయం కేవీబీ పురం రాయపేడు విడిది కేంద్రం నుంచి బయలుదేరిన లోకేష్ యువతతో సమావేశమయ్యారు. ఈరోజు పది గంటలకు కేవీబీ పురం జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.స
వివిధ వర్గాలతో సమావేశాలు...
అనంతరం 12.10 గంటలకు రాజులకండ్రిగలో స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు రాగిగుంటలో భోజన విరామం కోసం ఆగుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిమ్మనాయుడు గుంటలో ముత్తరాసి సామాజికవర్గం ప్రజలతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6.20 గంటలకు తిమ్మసముద్రంలో ఎస్టీ వర్గీయులతో సమావేశమవుతారు. రాత్రికి బైరాజు కండ్రిగ లో బస చేయనున్నారు.
Next Story

