Sat Mar 21 2026 14:52:28 GMT+0530 (India Standard Time)
Yuvagalam : 79వ రోజు కు పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 79వ రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 79వ రోజుకు చేరుకుంది. నేడు కూడా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోనే జరగనుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 1,020 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు కూడా వివిధ వర్గాలతో సమావేశమవుతూ, మమేకమవుతూ తన పాదయాత్రను కొనసాగించనున్నారు.
నేడు యాత్ర ఇలా...
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పాదయాత్ర నేడు కూడా పదిహేను కిలో మీటర్లు కొనసాగనుంది. ఆదోని నియోజకవర్గంలోని తుంబలం క్రాస్ వద్ద పంచాయతీరాజ్ ప్రతినిధులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. సాయంత్రం తుంబలం క్రాస్ రోడ్స్ వద్ద బస చేయనున్నారు.
Next Story

