Sun Feb 01 2026 06:52:53 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రగిరిలో నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 29వ రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 29వ రోజుకు చేరుకుంది. నేడు చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 367.3 కిలో మీటర్ల మేరకు నడిచారు. చంద్రగిరి నియోజకవర్గంలోని శివగిరి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం 9.15 గంటలకు శానంబట్ల గ్రామంలో స్థానికులతో నారా లోకేష్ మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
స్థానికులతో మాటామంతీ...
పదిన్నర గంటలకు పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ సామాజివర్గం ప్రజలతో లోకేష్ సమావేశమవుతారు. అనంతరం 10.45 గంటలకు తొండవాడ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. 11.45 గంటలకు తొండవాడలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం తిరిగి మూడు గంటలకు పాదయాత్రను ప్రారంభించి 4.30 గంటలకు చంద్రగిరి టవర్ క్లాక్ జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడ స్థానికులతో మాట్లాడతారు. రాత్రికి మామందూరులో బస చేయనున్నారు.
Next Story

