Sun Feb 01 2026 08:12:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏడురోజు నారాలోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుంది. ఆరు రోజుల్లో నారా లోకేష 72.1 కిలోమీటర్ల మేర నడిచారు. నిన్న ఒక్కరోజు 13.8 కిలోమీటర్ల మేర నారా లోకేష్ పాదయాత్ర చేశారు.
నేడు పలమనేరులో భారీ బహిరంగ సభ...
పలమనేరు సమీపంలోని కెటిల్ఫాం వద్ద రాత్రి బస చేసిన నారా లోకేష్ మరికాసేపట్లో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో అందరిని కలుస్తున్నారు. పాదయాత్రకు బయలుదేరే ముందు సెల్ఫీలు ఇస్తున్నారు.వివిధ వర్గాలతో లోకేష్ సమావేశమవుతున్నారు. ఈరోజు పలమనేరు పట్టణంలో భారీ బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు.
Next Story

