Sun Feb 01 2026 05:24:54 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రకు రెండు నెలలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 59వ రోజుకు చేరుకుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 59వ రోజుకు చేరుకుంది. నేడు ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు బత్తలపల్లి మండలం ముష్టూరు బస నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర అక్కడ రైతు ప్రతినిధులతో లోకేష్ సమావేశమవుతారు. 8.55 గంటలకు సంజీవ్పురంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో సమావేశమై ఉద్యోగ ఉపాధి కల్పనపై చర్చిస్తారు.
నేటి షెడ్యూల్ ఇలా...
9.50 గంటలకు యర్రాయపల్లి క్రాస్ రోడ్డు వద్ద స్థానికులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 12.20 గంటలకు రాప్తాడు నియోజకవర్గంలోని మన్నీల క్రాస్ రోడ్డు వద్దకు పాదయాత్ర చేరుకుంది. అనంతరం కృష్ణంరెడ్డిపల్లి వద్ద భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 3.50 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై 4.40 గంటలకు స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. అనంతరం 5.15 గంటలకు శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ వద్ద విద్యార్థులతో లోకేష్ భేటీ అవుతారు. తర్వాత పంగల్ రోడ్డు సమీపంలో రాత్రి బస చేయనున్నారు. లోకేష్ పర్యటనకు సంబంధించి పరిటాల శ్రీరామ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

