Fri Dec 05 2025 20:20:41 GMT+0000 (Coordinated Universal Time)
24వ రోజుకు లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 24వ రోజుకు చేరుకుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 24వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 312.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు కోబాక విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి 8.45 గంటలకు కొత్త వీరాపురంలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి లోకేష్ తెలుసుకుంటారు.
సమావేశాలు అవుతూ...
మధ్యాహ్నం 12 గంటలకు మడిబాకలో రైతులతో లోకేష్ ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మడిబాకలో మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 3.30 గంటలకు అక్కడి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మునగపాలెం స్థానికులతో సమావేశమవుతారు. 4.40 గంటలకు వికృతమాల గ్రామ ప్రజలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటలకు పాపనాయుడుపేటలో కైకాల సామాజికవర్గం ప్రజలతో సమావేశమవుతారు. 6.40 గంటలకు రేణిగుంట మండలం జీలపాలెం వద్ద రాత్రి బస చేయనున్నారు.
Next Story

