Sun Feb 01 2026 06:52:54 GMT+0000 (Coordinated Universal Time)
20వరోజుకు చేరుకున్న పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటికి 20వ రోజుకు చేరుకుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటికి 20వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 245 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం ఆయన సత్యవేడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయాన్నే బస వద్ద నారా లోకేష్ సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా లోకేష్ రోజుకు వెయ్యి మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ దిగుతున్నారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై ఆయన సమస్యలపై చర్చిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.
ఈరోజు షెడ్యూల్...
ఈరోజు కీలపూడిలోని విడిది కేంద్రంలో ఎస్సీ సామాజివర్గం ప్రజలతో సమావేశమవుతారు. 9.05 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం కీలపూడిలో రైతులతో సమావేశమవుతారు. అనంతరం 11 గంటలకు పిచ్చాటూరులో అరణ్య ప్రాజెక్టు వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. 12.50 గంటలకు వెంకటరెడ్డి కండ్రిగలో భోజన విరామానికి ఆగుతారు. అక్కడ మహిళలతో సమావేశమవుతారు. సాయంత్రం బయలుదేరి 4.30 గంటలకు ఆరాయిలో స్థానికులతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాయపేడు విడిది కేంద్రంలో రాత్రికి బస చేస్తారు.
Next Story

