Sat Dec 06 2025 15:46:36 GMT+0000 (Coordinated Universal Time)
యువగళం పునఃప్రారంభం వాయిదా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఆయన యాత్రను ప్రారంభించాలని భావించారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు. అయితే రేపు తిరిగి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
న్యాయనిపుణులతో...
యువగళం పాదయాత్రను వాయిదా వేసుకోవాలని టీడీపీ నేతలు నారా లోకేష్ ను కోరారు. అక్టోబరు 3న స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో వాదనల దృష్ట్యా వాయిదా వేసుకోవాలని వారు కోరారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను పునఃప్రారంభిస్తే న్యాయనిపుణులతో చర్చించడం కష్టమవుతుందని నేతలు సూచించడంతో లోకేష్ తన యువగళం పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలో ప్రకటిస్తామని నాయకులు తెలిపారు.
Next Story

