Fri Dec 05 2025 11:32:53 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేటి నుంచి నారా లోకేష్ శంఖారావం
ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ప్రారంభం కానుంది.

ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ప్రారంభం కానుంది. శంఖారావం పేరిట ఆయన ఉత్తరాంధ్ర నుంచి నేడు యాత్రను ప్రారంభించనున్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన పర్యటన సాగనుంది. తన పాదయాత్ర జరగని ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆయన శంఖారావం పేరిట యాత్ర చేయనున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నారా లోకేస్ శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది.
క్యాడర్ ను సమాయత్తం చేయడానికి...
ఎన్నికలకు క్యాడర్ లను, లీడర్లను సమాయత్తం చేయడానికి ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. మొత్తం యాభై రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలిలో ఆయన పర్యటించనున్నారు. తొలి దశలో పదకొండు రోజుల పాటు 31 నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో క్యాడర్ తో పాటు ముఖ్య నేతలతోనూ ఆయన సమావేశమవుతారు.
Next Story

