Fri Dec 05 2025 22:44:16 GMT+0000 (Coordinated Universal Time)
వంద కిలోమీటర్లు యాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 9వ రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 9వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ 100.8 కిలోమీటర్ల దూరం లోకేష్ నడిచారు. ఈరోజు వజ్రాలపల్లి బస నుంచి బయలు దేరనున్న లోకేష్ బీసీ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది.
వివిధ వర్గాల నేతలతో...
10.15 గంటలకు వంకమిట్టలో గంటలకు మామిడి రైతులతో సమావేశమవుతారు. సదకుప్పంలో ఎస్సీ మాల సామాజికవర్గ ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనునున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు గొల్లపల్లిలోని వడ్డెర సామజికవర్గం ప్రజలలో సమావేశమవుతారు. అనంతరం కొండ్రాజు కాల్వ వద్ద భోజన విరామం కోసం ఆగుతారు. తిరిగి సాయంత్రం ప్రారంభమయ్యే పాదయాత్ర 7.15 గంటలకు తవనంపల్లిలో ముగియనుంది. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Next Story

