Fri Dec 05 2025 22:44:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు లోకేష టూర్ ఎక్కడంటే?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు ఎనిమిదో రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు ఎనిమిదో రోజుకు చేరుకుంది. యువగళం పేరిట ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నారా లోకేష్ 88.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర నేడు కొనసాగనుంది.
అందరితో సమావేశాలు...
మొగిలి దేవాలయం సమీపంలోని రాత్రి బస నుంచి బయలుదేరనున్న లోకేష్ 10.15 గంటలకు బలిజపల్లి గ్రామస్థులతో భేటీ కానున్నారు. అనంతరం 11.40 గంటలకు శేషాపురంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.50 గంటలకు వెంకటగిరిలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించి జామియా మసీదులో ప్రార్థనలు చేస్తారు. అనంతరం బంగారుపల్లలో బహిరంగ సబలో ప్రసంగిస్తారు. రాత్రికి వజ్రాలపురం విడిదికేంద్రంలో బస చేయనున్నారు.
Next Story

