Sun Feb 01 2026 05:26:59 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు నారా లోకేశ్ సవాల్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో జరుగుతుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న యాత్రలో ఇటీవల పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎద్దేవా చేస్తున్నారని, కానీ టీడీపీ బలం లేని చోట తాను పోటీ చేశానని లోకేష్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మళ్లీ అక్కడే పోటీ చేస్తా...
అయినా ఈసారి మళ్లీ అక్కడే పోటీ చేస్తానని, తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో విజయమ్మ పోటీ చేస్తే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. జగన్ కూడా తన సొంత నియోజకవర్గం పులివెందుల కాకుండా మరెక్కడైనా పోటీ చేసి గెలవాలని లోకేష్ సవాల్ విసిరారు. సొంత ప్రాంతంలో గెలిచి చంకలు గుద్దుకోవడం వారికే చెల్లిందన్నారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్ అంతా బోగస్ అని అన్న లోకేష్ వైసీపీ వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. సమ్మిట్ వల్ల ఉపయోగమేమీ ఉండబోదన్నారు.
Next Story

