Thu Mar 19 2026 14:03:54 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాలో లోకేష్ పర్యటన
కడప జిల్లాలో నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు

కడప జిల్లాలో నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఎయిర్పోర్టు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లోనే లోకేష్ తో పలువురు టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
పోలీసుల ఆంక్షలు...
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకు ప్రత్యేకంగా కడపకు లోకేష్ వచ్చారు. ఆయనను పరామర్శించిన అనంతరం లోకేష్ ప్రొద్దుటూరుకు వెళతారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా లోకేష్ పరామర్శించనున్నారు. అయితే కడప జిల్లా సందర్భంగా లోకేష్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నిన్ననే నోటీసులు జారీ చేశారు.
Next Story

