Thu Mar 19 2026 07:04:11 GMT+0530 (India Standard Time)
నేడు వ్యాపార వర్గాలతో లోకేష్ సమావేశం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు వ్యాపారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు వ్యాపారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వర్తకులు, చిరు వ్యాపారులతో లోకేష్ చర్చించనున్నారు. విజయవాడలో ఎ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
సమస్యలపై...
ఈ ప్రభుత్వంలో వర్తక, వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నారా లోకేష్ వారితో చర్చిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కరపత్రాన్ని లోకేష్ విడుదల చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్తక, వ్యాపార వర్గాలకు జరుగుతున్న నష్టంపై అందులో వివరించనున్నారు.
Next Story

