Sun Mar 22 2026 06:28:45 GMT+0530 (India Standard Time)
Nara lokesh : నేడు విశాఖకు నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విశాఖకు రానున్నారు. ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖకు వస్తున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విశాఖకు రానున్నారు. ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖకు వస్తున్నారు. సాక్షి దినపత్రికపై గతంలో నారా లోకేష్ 75 కోట్ల మేరకు దావా వేశారు. ఈ పరువు నష్టం దావాకేసులో నారా లోకేష్ విశాఖకు వస్తున్నారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ తన పరువునకు భంగం కల్గించారని నారా లోకేష్ గతంలో దావా వేశారు. తప్పుడు కథనాలను ప్రచురించి తన పరువుకు నష్టం కల్గించారని నారా లోకేష్ పిటీషన్ లో పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులు....
ఈ కేసు విచారణలో భాగంగా నారా లోకేష్ నేడు విశాఖపట్నంకు వస్తున్నారు. లోకేష్ పర్యటనతో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశాయి. ఆయన వచ్చేది కోర్టు కేసు నిమిత్తమే అయినా పార్టీ కార్యక్రమాలను కూడా చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు లోకేష్ మద్దతు ప్రకటించే అవకాశముంది.
Next Story

