Thu Jan 29 2026 05:34:29 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ యువగళానికి బ్రేక్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు నేడు విరామం ప్రకటించనున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు నేడు విరామం ప్రకటించనున్నారు. తారకరత్న మృతితో నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి నివాళులర్పించేందుకు హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. గత నెల 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగానే తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆయనను వెంటనే మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
పాదయాత్రకు ముందు...
బావా అంటూ పిలిచే ఆ గొంతు వినిపించిందంటూ లోకేష్ తారకరత్న మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు వినిపించదంటూ లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పాదయాత్రకు ముందు లోకేష్ ను ఇంట్లో కలసి రాజకీయాలపై చర్చించిన విషయాన్ని కూడా కొందరు గుర్తు చేసుకుంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతుంది.
- Tags
- nara lokesh
- break
Next Story

