Thu Mar 19 2026 05:27:06 GMT+0530 (India Standard Time)
Breaking : నారా లోకేష్ కు గాయాలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గాయాలయ్యాయి.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గాయాలయ్యాయి. ఆయన రెండు భుజాలకు గాయాలయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నిన్న యువగళం పాదయాత్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దయెత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తరలి వచ్చారు.
కార్యకర్తల తోపులాటలో....
దీంతో కార్యకర్తల తోపులాటలో ఈ గాయాలయినట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులను నిలువరించడంలో ఇటు పోలీసులు, అటు లోకేష్ పాదయాత్ర వెంటే ఉన్న అనుచరులు కూడా విఫలమయ్యారు. ఈరోజు లోకేష్ కు అయిన గాయాలను పరిశీలించి వైద్యం అందించనున్నారు. ఇప్పటికే కొందరు వైద్యులు లోకేష్ వద్దకు చేరుకున్నారు.
Next Story

