Tue Dec 09 2025 19:18:26 GMT+0000 (Coordinated Universal Time)
నారా లోకేష్ కు కరోనా పాజిటివ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా సోకింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా సోకింది. కొంచెం అస్వస్థతగా ఉండటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. అయితే తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు.
హోం ఐసొలేషన్ లో...
స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సూచన మేరకు తాను హోం ఐసొలేషన్ లో ఉన్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని నారా లోకేష్ కోరారు.
Next Story

